నిన్న పాట.. ఈరోజు ఫైట్.. ఇది చరణ్ షెడ్యూల్

Published on Apr 15, 2021 12:33 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ చిరుతో కలిసి చాలాసేపు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇదే అభిమానుల్ని బాగా ఎగ్జైట్ చేస్తున్న అంశం. అభిమానులే కాదు మెగాస్టార్ చిరంజీవి సైతం కొడుకుతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నందుకు పొంగిపోతున్నారు. సినిమాలో ఇద్దరికీ చాలా కాంబినేషన్ సీన్స్ ఉండనున్నాయి. ఇందులో చరణ్ మీద రెండు పాటలు, పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట.

నిన్నమొన్నటి వరకు చరణ్, పూజా హెగ్డేల మీద పాటలను రూపొందించిన కొరటాల శివ ఈరోజు మాత్రం యాక్షన్ సీన్ చేస్తున్నారు. రెయిన్ ఎఫెక్ట్ లో జరిగే ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అవుతుందని తెలుసుస్తోంది. ధర్మస్థలి విలేజ్ సెట్లోనే ఈ ఫైట్ ఉండబోతోంది. కథలోని కీలక ఘట్టంలో ఈ పోరాట సన్నివేశం వస్తుందట. ఇందులో చిరు ఉండరు. చెర్రీకి ఇది సోలో ఫైట్. పాపులర్ స్టంట్ కొరియోగ్రఫర్లతో ఈ ఫైట్ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :