ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గోపాల గోపాల లో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్న సంగతి మనకు తెలిసిందే.. పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ సీన్ చూడగానే ఆడియన్స్ వావ్ అని షాక్ అయ్యేలా డిజైన్ చేసారు. వారు డిజైన్ చేసిన దాని ప్రకారం ఇంట్రడక్షన్ సీన్ లో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ చిత్ర డైరెక్టర్ కిషోర్ పార్ధసాని మరియు సృష్టి విఎఫ్ఎక్స్ వారు చాలా జాగ్రత్త తీసుకొని విజువల్ ఎఫెక్ట్స్ హై రేంజ్ లో ఉండేలా చూస్తున్నారు.
ఈ విషయం గురించి ఈ చిత్ర టీంని అడిగితే మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు సంథింగ్ స్పెషల్ గా అనిపించేలా ఇంట్రడక్షన్ ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ ఓ కామన్ మాన్ గా కనిపించనున్న ఈ సినిమాలో అతనికి జోడీగా శ్రియ శరన్ నటిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి ఇది రీమేక్. ఇంకా 20 రోజులు షూటింగ్ బాలన్స్ ఉన్న ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


