ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో వచ్చేసిన “ఛత్రపతి” హిందీ.!

Published on Nov 21, 2023 2:00 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు చిత్రాలతో పాటుగా ఆ మధ్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మన తెలుగులో సెన్సేషనల్ హిట్ “ఛత్రపతి” ని హిందీలో దర్శకుడు వి వి వినాయక్ తెరకెక్కించారు. అయితే భారీ బడ్జెట్ తో ఒక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా దీనిని తెరకెక్కించి థియేటర్స్ లో రిలీజ్ చేయగా నార్త్ లో ఈ సినిమాకి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

దీనితో ఇక అక్కడ నుంచి మళ్ళీ ఓటిటి రిలీజ్ ఊసు కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటి లో అయితే స్ట్రీమింగ్ కి ఈ రోజు నుంచి వచ్చేసింది. ఈ చిత్రం నేటి నుంచి హిందీలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అయితే తీసుకొచ్చారు. మరి అప్పుడు చూడని వారు ఓసారి ట్రై చేద్దాం అనుకునేవారు ఇప్పుడు ఈ వెర్షన్ ఛత్రపతి ని ప్రైమ్ వీడియోలో విట్నెస్ చెయ్యొచ్చు.

సంబంధిత సమాచారం :