హిందీ ‘ప్రస్థానం’ సిద్ధమైంది

హిందీ ‘ప్రస్థానం’ సిద్ధమైంది

Published on Jul 3, 2019 11:03 PM IST

దర్శకుడు దేవ కట్ట తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ‘ప్రస్థానం’ మంచి చిత్రంగా ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాతో దేవ కట్టలో మంచి దర్శకుడు ఉన్నాడనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అంతేకాదు ఈ సినిమా అందులో ప్రధాన పాత్రలు పోషించిన శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ కెరియర్లలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు సంజయ్ దత్.

సంజయ్ దత్ ఇందులో నటించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తున్నారు. హిందీలో కూడా చిత్రానికి ‘ప్రస్థానం’ అనే పేరునే పెట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ తేదీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో సంజయ్ దత్ తో పాటు మనీషా కొయిరాల, జాకీ ష్రాఫ్, చుంకి పాండే, అలీ ఫజల్, అమైరా దస్తూర్, సత్యజిత్ దూబే కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు