“వకీల్ సాబ్”లో అతని వర్క్ పైనే సర్వత్రా ఉత్కంఠ.!

Published on Apr 6, 2021 5:01 pm IST

మామూలుగానే బాక్సాఫీస్ దగ్గరకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయ్ అంటే ఆ హంగామానే వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు తెలుగులో మళ్ళీ చాలా కాలం అనంతరం వస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “వకీల్ సాబ్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కం బ్యాక్ చిత్రంగా వస్తున్న దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దీనిని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు.

అయితే ఓపెనింగ్స్ ఎలా లేదన్న హీరో మీదనే ఆధారపడి ఉంటుంది అని అందరికీ తెలిసిందే. ఇక అక్కడ నుంచి అంతా డైరెక్టర్ మ్యాజిక్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఇదే అంశం వకీల్ సాబ్ లో ఆసక్తి రేపుతోంది. పింక్ ను డైరెక్టర్ వేణు రెండున్నర గంటలు ఎలా డీల్ చేసారు అన్నదే అసలు ప్రశ్న. అసలు పాటలకు కానీ అన్ని ఫైట్ సీక్వెన్స్ లకు కానీ స్కోప్ లేని ఈ చిత్రంలో వాటిని కన్వీనెన్స్ గా ఎలా చూపించారు అన్నది చాలా ఉత్కంఠభరితమైంది.

పైగా హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి. మరి ఇవన్నీ మెయిన్ థీమ్ ను పక్క దారి పట్టించకుండా దర్శకుడు శ్రీరామ్ వేణు అండ్ టీం ఎలా వర్క్ చేసారు అన్నది కాస్త సీరియస్ గా ఆలోచించవలసిందే అని చెప్పాలి. ఏమన్నా తేడా జరిగితే పింక్ ను చెడగొట్టారు అన్న రిమార్క్ తప్పదు. కానీ సెన్సార్ రిపోర్ట్ లో మాత్రం సినిమా చాలా బాగుందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం వేణు వర్క్ ఎలా ఉందో తెలియాలి అంటే వచ్చే 9 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :