వైవిధ్యతకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు గుణశేఖర్ బర్త్ డే స్పెషల్.!

వైవిధ్యతకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు గుణశేఖర్ బర్త్ డే స్పెషల్.!

Published on Jun 2, 2021 12:09 AM IST

మన టాలీవుడ్ లో పౌరాణిక సినిమాలు అయినా ట్రెండ్ సెట్టింగ్ భారీ సెట్ వర్క్స్ అయినా పైగా అలాంటి వాటిని పెట్టి స్ట్రాంగ్ కంటెంట్ తో చెప్పే స్క్రీన్ రైటింగ్ కి అయినా ఇప్పుడు ఉన్న టాప్ మోస్ట్ దర్శకుల్లో మొట్టమొదట చెప్పుకోవాల్సిన పేరు గుణశేఖర్.. మరి ఆయన బర్త్ డే జూన్ 2న ఉండగా ఆయన కోసం ఓ స్పెషల్ ప్రెజెంటేషన్.. సినిమానే లోకంగా తన సినిమాలతో సరికొత్త లోకాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడు గుణశేఖర్.

తన మొదటి చిత్రం “లాఠీ”తోనే మూడు నంది పురస్కారాలు అందుకొని ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ చూపులు తనవైపు తిప్పుకున్న గుణశేఖర్ అక్కడ నుంచి తిరిగి చూసుకోలేదు సినిమా ట్రెండ్ మారుతుండడంతో భారీ సెట్ వర్క్స్ అప్పటిలోనే టచ్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. దానికి ఆద్యం పడింది మెగాస్టార్ చిరంజీవితోనే.. ఆయన చేసిన “చూడాలని ఉంది” సినిమాలోని అన్ని హంగుల పరంగా ఒక సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ఒక్క పాటలు కథా, కథనాలు పరంగానే కాకుండా ఏకంగా కోల్ కతా సెట్ నే వేసి చూపించడం ఓ వండర్ ఫుల్ మూవ్ అయ్యింది. అలా తర్వాత ఇప్పుడు మాస్ ని ఏలుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన “బాల రామాయణం”కి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన వారు అయ్యారు. మరి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన “ఒక్కడు” హిట్ కూడా ఒక సెన్సేషనే..

ఒక రకంగా చెప్పాలి అంటే మహేష్ కి మాస్ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ను సెట్ చేసిన మొదటి చిత్రం కూడా గుణశేఖర్ వలనే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో అప్పుడు వేసిన “ఛార్మినార్” సెట్ కానీ ఆ తర్వాత మహేష్ తో చేసిన “అర్జున్” చిత్రంలో వేసిన కామాక్షి మాత దేవాలయం సెట్ లు కోసం ఇండస్ట్రీ అంతా ఒకరేంజ్ లో చెప్పుకున్నారు.

అయితే ఒక పక్క కమెర్షియల్ సినిమాల పరంగానే కాకుండా గుణశేఖర్ కి చరిత్ర పట్ల పౌరాణిక చిత్రాల పట్ల కూడా మక్కువ ఎక్కువే.. అది బాల భారతం తోనే తెలిసిందే. అలా కాస్త గ్యాప్ ఎక్కువే తీసుకున్నా కూడా తెలుగులో మొట్టమొదటి 3డి టెక్నాలజీని పరిచయం చేసి తీసిన భారీ చిత్రం “రుద్రమ దేవి”. ఆ సినిమాలో కూడా మరింత హుందాతనం కనబరిచి మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకొని ఇపుడు కంప్లీట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ గా గుణశేఖర్ మారారు.

దాని తర్వాత ప్లాన్ చేసిన “హిరణ్యకశిప” అయితే పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. అయితే అది కాస్త లేట్ అయినా దానికి ముందు మాత్రం మరో చారిత్రాత్మిక చిత్రం “శాకుంతలం” ని స్టార్ హీరోయిన్ సమంతా తో ప్లాన్ చేశారు. ఇటీవల అనౌన్స్ చేసిన ఈ చిత్రానికి పాన్ ఇండియన్ లెవెల్లో మంచి ఆసక్తి కూడా రేగింది.

మరి ఈ చిత్రాన్ని ఎలాంటి స్టాండర్డ్స్ లో గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నారో ఇంకొన్నాళ్లలో మనం విట్నెస్ చేయనున్నాం. మరి ఇలా తన ప్రతీ చిత్రానికి ఎంతో వైవిధ్యతను కనబరుస్తూ వస్తున్న ఈ ప్రౌడ్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ మరిన్ని ఆనందకర జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భారతీయ సినిమా ఎల్లలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పరచాలని మా 123తెలుగు యూనిట్ వారికి బర్త్ డే విషెష్ తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు