అరెరె.. ఈ హిట్ హీరోయిన్ కి ఛాన్స్ లు రావట్లేదు !

Published on May 4, 2019 3:58 am IST

మజిలీలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించింది దివ్యాంశ కౌశిక్. నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది ఈ అమ్మడు. కానీ మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. దాంతో దివ్యాంశకు రావాల్సిన స్థాయిలో పేరు రాకపోవడంతో ప్రస్తుతం ఆమెకు ఆఫర్స్ కూడా రావట్లేదు.

మజిలీ టీం మొత్తం తమ తరువాత సినిమా పై దృష్టి పెడితే.. ఈ భామ మాత్రం సినిమా ఆఫర్ కోసం ఇంకా ఎదురుచూస్తూ ఉంది. మజిలీలో తన పాత్రలో అద్భుతంగా నటించినా ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో పాపం. మొత్తానికి దివ్యంశ కౌశిక్ పరిస్థితి.. సినిమా భారీ హిట్.. తాను మాత్రం ఫట్ మాదిరిగా తయారయింది.

ఒకపక్క సరైన హిట్ లేని నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసి కూడా దివ్యంశ కౌశిక్ ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. కనీసం నాగ చైతన్య అన్నా .. లేక దర్శకుడు శివ నిర్వాణనైనా తమ తరువాత సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తారేమో చూద్దాం.

సంబంధిత సమాచారం :

More