కరోనా వ్యాధితో మరో నటుడు మృతి

Published on Apr 9, 2020 5:55 pm IST

కరోనా మహమ్మారి మరో హాలీవుడ్ నటుడిని బలితీసుకుంది. కొద్దిరోజుల క్రితం స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ కరోనా వైరస్ కారణంగా మరణించడం జరిగింది. తాజాగా మరో హాలీవుడ్ నటుడు కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. నాష్ విల్లే, ది స్టంట్ మాన్ వంటి చిత్రాలలో నటించిన అలెన్ గార్ఫీల్డ్ ఈ మహమ్మారి వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఇక హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ సైతం కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకోవడం జరిగింది.

ఇండియాలో సెలెబ్రిటీ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. లండన్ వెళ్లి వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో రెండు వారాల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇక ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా స్థంబించిపోగా ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 1.5 మిలియన్స్ కి చేరింది. ఇక ఇండియాలో ఈ సంఖ్య 5 వేలు దాటిపోయింది.

సంబంధిత సమాచారం :

X
More