‘ఆర్‌ఆర్‌ఆర్’లో హాలీవుడ్ బ్యూటీ ట్రాక్ అదేనా ?

‘ఆర్‌ఆర్‌ఆర్’లో హాలీవుడ్ బ్యూటీ ట్రాక్ అదేనా ?

Published on Jun 7, 2020 12:08 AM IST

రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. కాగా సినిమాలో ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా తమ దేశం పైన, తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు ఇస్తుందని.. ఎన్టీఆర్ – ఒలివియా ట్రాక్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు మిస్ అయిన తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15 నుండి పరిమిత సిబ్బందితో చిత్రీకరణ ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు