కరోనాకు బలైన హీరోయిన్ తండ్రి

Published on Mar 22, 2020 10:26 pm IST

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి ఇటు సినిమాలు, షాపింగ్‌మాల్స్‌, షూటింగ్స్‌, అన్నీ బంద్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు గృహనిర్భంధంలో ఉంటూ కరోనా పై జాగ్రత్తలను చెబుతున్నారు. సెలబ్రెటీల సైతం వారి షూటింగ్‌లను మధ్యలోనే వదిలేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రధాని చెప్పినట్లే జనతా కర్ఫూను పాటిస్తూ వారి ఇళ్ళల్లోనే నిర్భంధమయ్యారు.

కాగా ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్‌ సోఫియా మైల్స్‌ తండ్రి పీటర్‌ మైల్స్‌ కరోనా బారిన పడి కన్నుమూశారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కొద్దిరోజుల కిత్రం కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇతర వ్యాధుల కారణంగా కోలుకోలేకపోయిన ఆయన శనివారం మరణించారు. తండ్రి మరణించిన విషయాన్ని సోఫియా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

సంబంధిత సమాచారం :