వరుణ్ తేజ్ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రఫర్లు !
Published on Mar 7, 2018 8:43 am IST

ఇటీవలే ‘తొలిప్రేమ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను మరింత భిన్నంగా స్పేస్ థ్రిల్లర్ జానర్లో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడు. చిత్రంలో చాలా భాగం కృత్రిమంగా సృష్టించిన జీరో గ్రావిటీ వాతావరణంలో చేయాల్సి ఉండటంతో వరుణ్ తేజ్ అండ్ టీమ్ జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకోనున్నారు.

ఇందుకోసం హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రఫర్ల సహాయం తీసుకోనున్నారట. దీని వలన స్పేస్ కు సంబందించిన సన్నివేశాలను ఖచ్చితత్వంతో షూట్ చేయవచ్చని చిత్ర యూనిట్ ప్లాన్. శ్రీహరి కోట బేస్ నైపథ్యంలో ఉండనున్న ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం జార్జియాలో వేయబోయే ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్ కూడ ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన లుక్ ను ట్రై చేస్తున్నాడు. త్వరలో మొదలుకానున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook