‘సైరా’ సినిమాకి కూడ హాలీవుడ్ టెక్నీషియన్లు !

‘సైరా’ సినిమాకి కూడ హాలీవుడ్ టెక్నీషియన్లు !

Published on Jun 1, 2018 5:15 PM IST

తెలుగు సినిమా పరిధి పెరుగుతున్న కొద్ది సాంకేతికంగా కూడ పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిర్మాతలు, దర్శకులు సాంకేతికంగా చిత్రం ఉన్నత స్థానంలో ఉండేందుకు, కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు హాలీవుడ్ టెక్నీషియన్లను ప్రాజెక్ట్ లోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ‘బాహుబలికి, హలో, సాహో, నా పేరు సూర్య’ సినిమాలకు విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేయగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రానికి కూడ హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు.

జూన్ 7వ తేదీ నుండి ‘సైరా’ కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ఇందులో కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకున్నారు టీమ్. ఈ చిత్రీకరణలో అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు