పవర్ స్టార్ హీరోగా ‘కెజిఎఫ్’ నిర్మాతల భారీ ప్రాజెక్ట్

Published on Jun 30, 2021 7:41 pm IST


కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ గురించి తెలియని వారుండరు. ‘కెజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హోంబలే ఫిల్మ్ సినిమా అంటే భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అనే క్రేజ్ తెచ్చుకుంది. ‘కెజిఎఫ్’ ఇచ్చిన స్పూర్తితో కొత్త చిత్రాలను కూడ భారీ లెవల్లో నిర్మిస్తున్నారు హోంబలే నిర్మాతలు. ప్రస్తుతం వీరు నిర్మించిన ‘కెజిఎఫ్ 2’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రం మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కాకుండా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కూడ పాన్ ఇండియా సినిమానే. 250 కోట్లకు పైగానే బడ్జెట్ వెచ్చిస్తున్నారు.

ఈ సినిమా కాకుండా ఇంకో కొత్త చిత్రానికి హోంబలే ఫిల్మ్ శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ కన్నడలో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో. ఆయనతో పాన్ ఇండియా సినిమా అంటే వేరే లెవల్ అనుకోవాల్సిందే. భారీ బడ్జెట్ వెచ్చించి ఈ సినిమా చేస్తున్నారు. పవన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రేపు జూలై 1వ తేదీన సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను రివీల్ చేయనున్నారు టీమ్. దీంతో ఈ సంస్థ రెండు పాన్ ఇండియా సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

సంబంధిత సమాచారం :