కామిక్ రోల్ లో హోమ్లీ హీరోయిన్ !

కామిక్ రోల్ లో హోమ్లీ హీరోయిన్ !

Published on Aug 11, 2020 1:50 AM IST


ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ మీనా తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ కుమారన్ తెరకెక్కిస్తున్నారు. వివేక్ కుమారన్ మీనా కోసమే ఈ వెబ్ సిరీస్ రాశాడట. కాగా వచ్చే నెల మూడో వారం నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగనుంది. ఈ షూట్ లో మీనాతో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొనాబోతున్నారు. ఏమైనా 90లలో తెలుగు, తమిళ భాషలలో టాప్ స్టార్ గా కొనసాగిన మీనా మొదటిసారి ఇలా ఓ వెబ్ సిరీస్ చేయడం, పైపెచ్చు మీనా ఈ సిరీస్ లో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఉంది.

అలాగే ఆమె పాత్ర చాల కామిక్ గా ఉండనుందని తెలుస్తోంది. మరి మీనా కామెడీ చేయగలదా.. గతంలో మీనా నటించిన చాలా సినిమాలు చూస్తే.. మీనా అమాయకమైన రొమాంటిక్ కామెడీని బాగా చేస్తోంది. ఆయితే సీరియస్ కామెడీని ఎలా చేస్తోందో చూడాలి. అన్నట్టు మీనా తమిళంలో ఒక సినిమాతో పాటు ఒక సీరియల్ లో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో కూడా రాజశేఖర్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు