‘అదుర్స్ 2’ హోప్ ఇచ్చినా కష్టమేనా?

Adhurs-2

తెలుగు సినిమా దగ్గర ఉన్నట్టువంటి సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా అందులోని డబుల్ రోల్ చేసిన ఎంటర్టైనర్ చిత్రం అదుర్స్ కూడా ఒకటి. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో భారీ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అనే మాటలు, రచయిత కోనా వెంకట్ నుంచి ఎప్పుడు నుంచో వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ సీక్వెల్ పై మరోసారి హోప్ ఇచ్చారు.

ఈ సీక్వెల్ ఉంటుంది అని అంతేకాకుండా ఆల్రెడీ అరగంట స్టోరీ కూడా సిద్ధంగా ఉందని ఎన్టీఆర్ కి ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ తర్వాత వినాయక్ తో కలిసి ఎన్టీఆర్ కి కథ చెప్తాం అన్నట్టు తెలిపారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్, స్టార్డంతో ఈ సినిమా చేయడం జరిగే పనేనా అంటే అందుకు సానుకూల సమాధానం కష్టమే అని చెప్పొచ్చు. సో ఇందుకు కాలమే సమాధానం అందివ్వాలి.

Exit mobile version