సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ని నేడు విడుదల చేయడం జరిగింది. చిత్రం పై తెలుగు, కన్నడ నాట ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను నేరుగా సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.
దండుపాళ్యం 4 చిత్రాన్ని పూర్తిగా కొత్త నటులతో తెరకెక్కించారు.తెలుగు క్యారక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ మరియు నటి మొమైత్ ఖాన్ ఈ చిత్రంలో నటించడం విశేషం. గత చిత్రాలలో మాదిరే ఈ మూవీలో కూడా హింసా,నేర ప్రవృత్తి, హింసాత్మక శృంగారం ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది. వెంకట్ మూవీ బ్యానర్ పై నిర్మాత వెంకట్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం భువన చంద్ర అందించారు.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


