అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హాట్ బ్యూటీ

అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హాట్ బ్యూటీ

Published on Jul 15, 2015 7:00 PM IST

madurima
‘సరదాగా కాసేపు’, ‘షాడో’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హాట్ బ్యూటీ మధురిమ. గత ఏడాది అటు ‘అమలాపురం ఇటు పెద్దాపురం’ అంటూ ‘కొత్త జంట’ సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చిన మధురిమ’ ఈ ఏడాది ‘టెంపర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. టెంపర్ లో తను చేసింది చిన్న పాత్రే అయినా ఆ పాత్రకి మంచి పేరు వచ్చింది. మధురిమ నటించిన తెలుగు సినిమా ‘బెస్ట్ యాక్టర్స్’ రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ హీరోయిన్ గా కనిపించిన ఈ భామ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తనుంది.

అదేదో సినిమాలో తను చేయనున్న పాత్ర అనుకునేరు.. నిజంగా ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం కానుంది. అది కూడా చిన్న సినిమాకి కాదండోయ్.. మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా ‘అజార్’ అనే సినిమా బాలీవుడ్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇమ్రాన్ హజ్మీ అజార్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి టోనీ డిసౌజా డైరెక్టర్. ‘ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అందుకే ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. త్వరలోనే షూటింగ్ కోసం లండన్ వెళ్లనున్నామని’ మధురిమ తెలిపింది. మరి హీరోయిన్ గా ఆకట్టుకున్న ఈ భామ టెక్నికల్ గా ఎలాంటి నాలెడ్జ్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు