ఎన్.టి.అర్ సినిమాకి స్టార్ స్టంట్ మాస్టర్

ఎన్.టి.అర్ సినిమాకి స్టార్ స్టంట్ మాస్టర్

Published on May 3, 2015 6:04 PM IST

Temper-ntr

‘టెంపర్’ సూపర్ హిట్ తో ఫుల్ ఫాంలోకి వచ్చిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్వరలోనే తన తదుపరి సినిమా షూటింగ్ ని మొదలు పెట్టె పనిలో ఉన్నాడు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తో ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మే 14 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లండన్ లో మొదలవుతుందని, అందులోనూ ముందుగా ఎన్.టి.ఆర్ పైన షూట్ చేసే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుందని ఇది వరకే తెలియజేశాం.

ఇప్పుడు మీకో ఆసక్తికరమైన విషయం తెలియజేస్తున్నాం. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న బిజీ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ని ఈ సినిమా కోసం ఎంపిక చేసారు. ఎన్. టి.ఆర్ పై షూట్ చేసే లండన్ ఫైట్ ని పీటర్ హెయిన్ కంపోజ్ చేయనున్నాడు. రోబో, 1- నేనొక్కడినే లాంటి సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్టాత్మక బాహుబలి, రుద్రమదేవి సినిమాలకు యాక్షన్ ఎపిసోడ్స్ ని కంపోజ్ చేసిన పీటర్ హెయిన్ కి ఇండియాలో మంచి పేరుంది. ఇప్పుడతను ఎన్.టి.ఆర్ కి సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసాడని సమాచారం. ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ రివెంజ్ డ్రామాకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనుంటే, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు