షూటింగ్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది !

Published on Jun 7, 2020 3:12 pm IST

మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా తీవ్రత ఇంకా భారత్‌ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒకపక్క పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది. అయితే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సినీ జనం బతుకులు మళ్ళీ కుదట పడాలంటే షూటింగ్స్ స్టార్ట్ అవ్వాలి. అందుకే టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వంతో కలిసి చర్చించి జూన్ 15 నుంచే షూటింగ్ లు మొదలెట్టన్నారు.

కాగా విడుదలకు దాదాపు సిద్దంగా వున్న ప్రతి సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ ముందుగా షూట్ చేయనున్నారు. మరి కొన్ని సినిమాలకు ఎక్కవ వర్క్ నే వుంది. కొన్ని సినిమాలకు పాటల పని పెండింగ్ వుంది. సో ఈ సినిమాల షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

మరి షూటింగ్ లు ఇప్పటికిప్పుడు ప్రారంభమైతే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. దాంతో పెద్ద నిర్మాతల దగ్గర నుండి చిన్న నిర్మాతల వరకూ ఎక్కువ జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కానుంది. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినా సినిమా రిలీజ్ కూడా కష్టంగానే ఉంది. దేశవ్యాప్తంగా క్లోజ్ లో ఉన్న థియేటర్ల ఓపెన్ అయ్యే పరిస్థితి ఇప్పట్లో ఉందా అనేది మరో ప్రశ్న.

అయినా షూటింగ్స్ అంటే వందలమందితో చేయాల్సన పని. ఈ నేపథ్యంలో కేంద్రం చెప్పిన 16పేజీల మార్గదర్శకాలను షూటింగ్ స్పాట్లో తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసినా అది సాధ్యం అవుతుందా ? ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజరు, గ్లౌజులు వరకూ జాగ్రత్తలు తీసుకుంటారు గాని, షూటింగ్స్ లో భౌతికదూరం ఎలా పాటిస్తారనేది ఇక్కడ సమస్య.

సంబంధిత సమాచారం :

More