‘విశ్వరూపం 2’ ఎలా ఉండబోతుంది ?

‘విశ్వరూపం 2’ ఎలా ఉండబోతుంది ?

Published on Aug 9, 2018 5:32 PM IST

viswa

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కమల్ హాసన్ తను స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘విశ్వరూపం 2’. కాగా ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

తమిళంతో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా భారీగా విడుదలవుంతుంది ఈ చిత్రం. ఐతే తమిళనాట కరుణానిధి మరణం కారణంగా ఈ చిత్రం ఓపెనింగ్స్ పై కొంత ఎఫెక్ట్ పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఓ హాలీవుడ్ చిత్రానికి ప్రేరణగా ఈ చిత్రం రూపొందినదని తెలుస్తోంది. ఫైట్ సీక్వెన్స్ స్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నారు. ముఖ్యంగా కమల్ పాత్ర తాలూకు సన్నివేశాలకు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని, అలాగే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ స్ కూడా బాగా వచ్చాయని సమాచారం. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంలో కమల్ సరసన పూజా కుమార్ మరియు ఆండ్రియా నటించారు.

తాజా వార్తలు