పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందివ్వడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. దాంతో ఈ సినిమా ఆడియోని డిసెంబర్ లోనే రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు, ఇందులో హీరో – హీరోయిన్స్ మధ్య ఉండే డ్యూయెట్ సాంగ్స్ ఉండవు. మరి ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనే అనుమానం చాలా మంది మదిలో ఉంది..
మాకు అందిన సమాచారం ప్రకారం అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ‘గోపాల గోపాల’ మ్యూజిక్ ఆల్బంలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ పై వచ్చే సాంగ్. ఇది కాకుండా వెంకటేష్ – శ్రియ శరన్ లపై ఓ సాంగ్ ఉంటుంది. ఈ రెంటితో పాటుగా పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్ లో ఓ సాంగ్ ఉంటుంది. ఇటీవలే వెంకీ – శ్రియల సాంగ్ ని వైజాగ్ లో షూట్ చేస్తే, పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ ని వారణాశిలో షూట్ చేసారు. ఈ మూడు కాకుండా కథానుసారం బిట్ సాంగ్స్ ఉన్నా అది బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


