ఆర్ ఆర్ ఆర్ లో వారిద్దరి లుక్స్ రాజమౌళి అలా సెట్ చేశారా?

Published on Sep 16, 2019 7:08 am IST

రాజమౌళి చిత్రం అంటేనే చిత్ర వర్గాలతో పాటు, సాధారణ ప్రేక్షకులలో ఉండే ఆసక్తే వేరు.ఆయన చిత్రంలోని చిన్న విషయం కూడా పెద్ద సెన్సేషనే. అలాంటిది మరి తారక్, చరణ్ లాంటి ఇద్దరు టాప్ స్టార్స్ తో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ గురించి ఐతే అంచనాలు మాములుగా లేవు.
కాగా ఎన్టీఆర్ చరణ్ లుక్స్ పై ఇండస్ట్రీలో అమితాసక్తి నెలకొని ఉంది.ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా, చరణ్ ని అల్లూరి గెటప్ లో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే వారి లుక్స్ రాజమౌళి ఎలా డిజైన్ చేయనున్నారు అనేది ఆసక్తికరం.

వాస్తవానికి కొమరం భీమ్ కోరమీసం, తలపాగాలో ఉంటారు కాబట్టి, ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ గురించి అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. కానీ చరణ్ సంగతేంటి?. అల్లూరి సీతారామ రాజు బాగా పెరిగిన గడ్డం మరియు జులపాలతో ఉంటారు. ఒక ప్రక్క ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నా చరణ్ జుట్టు పెంచలేదు. మరి అల్లూరి గా చరణ్ ని చూపించడానికి జక్కన్న విగ్ ఏమైనా వాడుతాడా లేక, కొమరం భీమ్ లుక్ లానే తలపాగాతో లాగించేస్తారు?.

ఆ పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని కల్పిత కథతో తెరకెక్కిస్తున్నారు కాబట్టి లుక్స్ కూడా కొంచెం విభిన్నంగా ఉంటాయా అనిపిస్తుంది. మరి ప్రతి విషయంలో క్లియర్ గా ఉండే జక్కన్న ఈ విషయాన్ని ఎలా ప్లాన్ చేశారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More