స్టైలిష్ స్టార్ స్ట్రామ్ ఎలా ఉంటుందో మరి.?

స్టైలిష్ స్టార్ స్ట్రామ్ ఎలా ఉంటుందో మరి.?

Published on Aug 15, 2020 9:15 AM IST

ఈ కొత్త సంవత్సరం ఆరంభంతోనే రెండు భారీ హిట్లతో తెలుగు ఇండస్ట్రీ కళకళలాడింది అనుకునే ఆనందం కొన్నాళ్ళు కూడా ఉండనివ్వలేదు. కరోనా దీనితో ఆ రెండు భారీ చిత్రాల సందడి తోనే థియేటర్స్ ఆగిపోయాయి. ఆ చిత్రాలే ఒకటి సూపర్ స్టార్ మహేష్ నటించిన “సరిలేరు నీకెవ్వరు” మరొకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురములో”.

ఈ రెండు చిత్రాలుఅంత గట్టి పోటీ నడుమ కూడా భారీ వసూళ్లను రాబట్టి టాలీవుడ్ లో హైయెస్ గ్రాసింగ్ చిత్రాలుగా నిలిచాయి. అయితే వాటిలో సరిలేరు నీకెవ్వరు చిత్రం అయితే స్మాల్ స్క్రీన్ పై హిస్టరీ క్రియేట్ చేసింది. ఆల్ టైం రికార్డు టీఆర్పీ రేటింగ్ తో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అప్పుడు మహేష్ వంతు అయితే ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది.

ఈ ఆగష్టు 16 న జెమినీ ఛానెల్లో “అల వైకుంఠపురములో” టెలికాస్ట్ కానుంది. దీనితో ఈ చిత్రం కూడా భారీ టీఆర్పీ రికార్డులను నమోదు చేస్తుందని అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి వెండితెర పై భారీ విజయాన్ని సొంతం చేస్తున్న బన్నీ స్మాల్ స్క్రీన్ పై కూడా ఆల్ టైం రికార్డులు సృష్టిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు