మరోసారి సమ్మోహన పరచనున్న క్రేజీ హీరోయిన్ !

Published on Aug 27, 2018 9:39 am IST


సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అతిధి రావ్ హైదరి తన అందంతో పాటు తన అభినయాన్ని కూడా చక్కగా ప్రదర్శించి అన్నివర్గాల ప్రేక్షకులని అలరించి మెప్పించింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలవర్షం కురింపించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆమె మరో చిత్రంలో నటించనుంది.

విశాల్‌ హీరోగా గత ఏడాది వచ్చిన డిటెక్టివ్‌ సినిమా దర్శకుడు మిస్కిన్‌ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అతిధి రావ్ హైదరి అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు మిస్కిన్‌, ఆమెకు కథ చెప్పటం జరిగింది. తన పాత్ర నచ్చడంతో ఉదయనిధి స్టాలిన్‌ సరసన నటించేందుకు అతిధి అంగీకరించింది. పీసీ శ్రీరామ్‌ కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకం పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More