‘కంచె’కి మెగాస్టార్ అభినందనలు

‘కంచె’కి మెగాస్టార్ అభినందనలు

Published on Oct 25, 2015 3:18 PM IST

chiranjeevi-kanche
బాహుబలి, రుద్రమదేవి లాంటి ఎపిక్ స్టోరీస్ తర్వాత తెలుగు చలన చిత్ర సీమ నుంచి వచ్చిన వరల్డ్ వార్ II ఎపిక్ ఫిల్మ్ ‘కంచె’. గమ్యం, వేదం, కృష్ణం వందేజగద్గురుమ్ లాంటి డిఫరెంట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. 1940 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ ప్రేమకథకి వరల్డ్ వార్ II ఎపిసోడ్ ని మిక్స్ చేసి చెప్పడం అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రావడమే కాకుండా డీసెంట్ కలెక్షన్స్ ని కూడా రాబట్టుకుంటోంది.

అంతే కాకుండా ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ అందరూ ఈ సినిమాపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్ర టీంని తన ఇంటికి ఆహ్వానించి మరీ వారిని అభినందించారు. ‘కంచె అనేది ప్రయోగాత్మక సినిమా కాదు, ఇదొక విజయవంతమైన సినిమా.. పల్లెటూరి వాతావరణం, ప్రేమకథ మరియు రెండవ ప్రపంచ యుద్దాన్ని చాలా బాగా చూపించారు. వరుణ్ తేజ్ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. తండ్రిగా వరుణ్ ని చూసి చాలా గర్వపడుతున్నాను. బడ్జెట్ మరియు షూటింగ్ డేస్ ని పెంచుకుంటూ పోతున్న ఈ రోజుల్లో క్రిష్ జార్జియాలో వరల్డ్ వార్ 2 ని షూట్ చేసి కూడా కేవలం 55 రోజుల్లో షూట్ ని ఫినిష్ చెయ్యడం తన ప్రతిభకి నిదర్శనం. కంచె లాంటి సినిమాలు మరిన్ని రావాలని’ చిరు అన్నారు.

తాజా వార్తలు