
కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చేటంత బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాలకృష్ణను ఈతరానికి సూపర్ స్టార్‌గా పరిచయం చేసిన ఘనత భోయపాటి శ్రీనుకు దక్కుతుంది. బాలయ్యతో ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన భోయపాటి శ్రీను, బాలయ్య వందో సినిమాకు కూడా దర్శకత్వం వహించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఇక నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంట్లో జరిగిన వేడుకలో భోయపాటి శ్రీను పాల్గొన్నారు. ఇక ఇదే వేడుకలో బాలయ్య తాజా సినిమా ‘డిక్టేటర్’ టీంతో పాటూ ‘లెజెండ్’ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. బాలయ్యకు కేక్ తినిపిస్తూ సందడిగా కనిపించిన భోయపాటి శ్రీనును ఈ ఫోటోలో చూడొచ్చు. ‘లెజెండ్’ సినిమా డైరెక్టర్‌తో యాక్టింగ్ లెజెండ్ సంబరాలు బాగున్నాయి కదూ..!!