తన మనసుకి నచ్చినప్పుడు రిటైర్ అవుతానన్న తాప్సీ

తన మనసుకి నచ్చినప్పుడు రిటైర్ అవుతానన్న తాప్సీ

Published on Jan 20, 2015 9:00 PM IST

tapsii
టాలెంటెడ్ నటి తాప్సీ ప్రస్తుతం తన కెరీర్ లో మంచి ఫేజ్ లో వుంది. ప్రస్తుతం ఎన్నో బాషల్లో కొన్ని ఆశక్తికరమైన పాత్రలు పోషిస్తుంది. తన తాజా హిందీ చిత్రం ‘బేబీ’ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తాప్సీ భారీ గా ప్రమోట్ చేస్తుంది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా చేస్తున్నపుడు తన కెరీర్ గురించి మాట్లాడుతూ తనకి మంచి పాత్రలు రావడం ఆగిపోయిన వెంటనే తనకి తానుగా సినిమాలలో నటించడం మానేస్తానని చెప్పింది. అంతేకాకుండా తనకి సహాయనటి గా నటించడం ఎంత మాత్రం ఇష్టం లేదని ఆనందంగానే రిటైర్ అవుతానని తెలిపింది. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ‘ముని 3’ లో నటిస్తుంది.

తాజా వార్తలు