ఖైధీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు !

khaidi150-1
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’కి ఆడియో వేడుక లేదని తెలియగానే మెగా అభిమానులంతా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఆ తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ప్రకటించగానే రెట్టింపు ఉత్సాహంతో వేడుకకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని విజయవంతం చేయాలని ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు కొత్త తరహా వ్యూహాలను రచిస్తున్న నైపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకు భారీగా అభిమానులు తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

అందుకే వేడుక జరగబోయే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. అలాగే స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఈవెంట్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇకపోతే ఖైదీ మొత్తం ఆడియో పాటలు ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి విడుదలవుతుండగా చిత్రాన్ని 2017 జనవరి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు టీజర్, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు విపరీతమైన క్రేజ్ రావడంతో సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.