శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమా బడ్జెట్ 120 కోట్లా ?

Published on Jun 23, 2021 2:02 am IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ స్ట్రైట్ మూవీ కావడం విశేషం. ధనుష్ తమిళ సినిమాలకు తెలుగునాట కూడ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన తెలుగులో సినిమా చేసున్నారు అనేసరికి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ భారీ లెవల్లో నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది.

ఈ సినిమా కోసం నిర్మాతలు 120 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల ఇంత భారీ బడ్జెట్ సినిమా చేసింది లేదు. కానీ ధనుష్ హీరో కావడంతో లెక్క పెరిగింది. సినిమా మీద 120 కోట్లు వెచ్చిస్తున్నారు అంటే ఇదేదో లవ్ స్టోరీ మాత్రమే అయ్యుండకపోవచ్చు. కథలో ఏదో పెద్ద విశేషమే ఉండి ఉండాలి. అందునా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాణ విలువలు గొప్పగానే ఉండాలి. అన్ని భాషలకు చెందిన స్టార్ నటీనటులను తీసుకోవాలి. ఇవనీ జరగాలి అంటే హెవీ బడ్జెట్ ఉండాల్సిందే. ఈ త్రిభాషా చిత్రం కోసం ధనుష్ భారీగానే పారితోషకం తీసుకుంటున్నారట.

సంబంధిత సమాచారం :