“ఆదిపురుష్”లో ఈ పార్ట్ కే భారీ బడ్జెట్.?

Published on Mar 21, 2021 12:01 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆదిపురుష్” పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా, కృతి సీత పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ రావణ పాత్రలో చేస్తున్నాడు. మరి క్యాస్టింగ్ పరంగా ఇంత భారీగా ఉన్న ఈ సినిమా మినిమమ్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో మొట్ట మొదటగా మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ అయ్యింది. అలాగే ఇది ఈ విజువల్ వండర్ లో అతి కీలకంగా తెరకెక్కిస్తున్నారు. మరి కేవలం ఈ పార్ట్ కు మాత్రమే మేకర్స్ 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్ గా ఉంటుంది అని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు. మరి రేపు సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :