అక్కినేని నాగచైతన్య చిత్రాలకి ఓవర్ సీస్ లో రోజురోజుకి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. చైతూ సవ్యసాచి చిత్రానికి 3 కోట్లు ఇరవై లక్షలకి పైగా రేటు పలికింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రానికి అయితే ఓవర్ సీస్ లో 3 కోట్లు పదిహేను లక్షల రేట్ ను ఫైనల్ చేసేసారట. ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డి ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ను తీసుకుంటున్నారు. శైలజారెడ్డి అల్లుడుకి మారుతి బ్రాండ్ కూడా ఉపయోగపడిందని చెప్పుకుంటున్నారు.
అక్కినేని నాగచైతన్య ‘ శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం తర్వాత ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా ఆయన సతీమణి అక్కినేని సమంత నటిస్తోంది. వీరిది హిట్ కాంబినేషన్. మరి ఆ చిత్రం కూడా హాట్ అవుతుందేమో చూడాలి.


