నిఖిల్ ‘సూర్య vs సూర్య’కి పాజిటివ్ టాక్

నిఖిల్ ‘సూర్య vs సూర్య’కి పాజిటివ్ టాక్

Published on Mar 4, 2015 4:37 PM IST

surya vs surya
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ అందుకున్న హీరో నిఖిల్. గత సినిమాల మాదిరిగానే నిఖిల్ సరికొత్త కథాంశంతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి చేసిన సినిమా ‘సూర్య vs సూర్య’. సెన్సార్ నుండి ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి పుల్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా నిఖిల్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని అంటున్నారు.

మరోవైపు ఈ చిత్ర టీం జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత 4 రోజులుగా నిఖిల్ అన్ని ఛానల్స్ కి, మీదికి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాగే ఈ సినిమా నిఖిల్ కి కొన్ని సర్ప్రైజెస్ కూడా ఇచ్చింది. మొదటిసారి తన సినిమా హైదరబాద్ లో మేజర్ సింగిల్ స్క్రీన్స్ అయిన భ్రమరాంబ, విశ్వనాధ్ లలో పాటు సత్యం, శ్రీ రాములు థియేటర్స్ లో కూడా రిలీజ్ అవుతుండడం ఎంతో సర్ప్రైజింగ్ గా ఉందని నిఖిల్ అంటున్నాడు.

నిఖిల్ సరసన త్రిదా చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య కీలక పాత్రలలో నటించారు. ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అందించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు