
ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్, సినిమా బడ్జెట్ 250కోట్లకి పైనే, ప్రీ ప్రొడక్షన్ మరియు షూటింగ్ కి పట్టిన సమయం మూడేళ్ళు.. ఇవన్నీ మరి కొద్ది గంటల్లో మన ముందుకు రానున్న భారీ పీరియడ్ ఫిల్మ్ ‘బాహుబలి’ గురించే. అభిమానుల్లో ఉన్న అంచనాల మేర, అలాగే రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో భారీ రేటుకి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. అంతే కాకుండా అన్ని చోట్లా రిలీజ్ కి ముందే బయ్యర్స్ లాభాలను కూడా అందుకుంటున్నారు. తమిళనాడు థియేటర్ రైట్స్ కొన్న బయ్యర్స్ ఇప్పటికే 4.5 కోట్ల లాభానికి సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మేసారు.
ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందే తమిళ బాహుబలి శాటిలైట్ రైట్స్ కి భారీ రేటు వచ్చింది. ఓ లీడింగ్ తమిళ్ చానల్ వాళ్ళు శాటిలైట్ రైట్స్ కోసం 8 కోట్లు ఆఫర్ చేసారు కానీ బయ్యర్స్ ఆ డీల్ ని హోల్డ్ లో పెట్టారు. సినిమా ఎలాగు మంచి సక్సెస్ అవుతుంది, ఒకసారి రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ ని బట్టి మరింత ఎక్కువ రేటుకి శాటిలైట్ రైట్స్ ని అమ్మాలని ఈ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టారు. భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా కోసం ప్రభాస్ రెండున్నరేళ్ళుకి పైగా సమయాన్ని కేటాయించడమే కాకుండా, రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రానా, తమన్నా, అనుష్క, రమ్య కృష్ణ, సత్య రాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

