తలపతి 63 కి ఓవర్సీస్ లో క్రేజ్ మాములుగా లేదు !

Published on Apr 16, 2019 6:08 pm IST

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తలపతి 63 షూటింగ్ ఇప్పటివరకు 65 శాతం కంప్లీట్ ఆయ్యింది. త్వరలోనే మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఇటీవల ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ , డిజిటల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడవ్వగా తాజాగా ఓవర్సీస్ రైట్స్ కూడా భారీ ధర పలుకుతుందట. విజయ్ కి అక్కడ మంచి మార్కెట్ వుంది. దాంతో ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను 30కోట్ల కు అమ్మనున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తుండగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక అట్లీ -విజయ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘తెరి ,మెర్సల్’ ఒకదానిని మించి ఒకటి భారీ విజయాలు సాధించడం తో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :