పీక్స్‌లో ‘వారణాసి’ క్రేజ్.. ఎగబడుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్..!

పీక్స్‌లో ‘వారణాసి’ క్రేజ్.. ఎగబడుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్..!

Published on Mar 7, 2026 2:00 PM IST

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సృష్టించిన ప్రభంజనం చూస్తుంటే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక అపూర్వమైన దృశ్యకావ్యంగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు వస్తున్న డిమాండ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ పంపిణీ సంస్థ ‘ఫార్స్ ఫిలిమ్స్’ ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా రూ.160 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్ని ఇండియన్ భాషలకు కలిపి ఈ స్థాయి ధర పలకడం ఒక రికార్డ్. మహేష్ బాబు స్టార్ పవర్, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడవ్వడంతో, సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వకముందే ఈ రేంజ్ బిజినెస్ జరగడం గమనార్హం.

రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి 2’, ‘RRR’ అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు ఈ భారీ ఆఫర్లకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంటార్కిటికా వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటూ బిజీగా ఉంది. కేవలం ఓవర్సీస్ రైట్స్ రూ.160 కోట్లు పలుకుతుంటే, రాబోయే రోజుల్లో థియేట్రికల్, శాటిలైట్ హక్కులు ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తాయో అని పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు