బాలయ్య లేటెస్ట్ యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ రూలర్ ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు అనిపించింది. ఐతే మొదటి షో నుండే ప్రతికూల టాక్ తో మొదలైన రూలర్ పరిస్థితి రెండవ రోజు అంత ఆశాజనంగా లేదు. ముఖ్యంగా నైజాంలో ఈమూవీ వసూళ్లు భారీగా పడిపోయాయి. మొదటిరోజు 68లక్షల షేర్ రాబట్టిన రూలర్ రెండవ రోజు కేవలం 30లక్షల షేర్ కే పరిమితమైంది. దీనితో రెండు రోజులకు గాను రూలర్ నైజాంలో 98లక్షల షేర్ వసూలు చేసింది. కనీసం ఆదివారం రూలర్ మెరుగైన వసూళ్లు సాధిస్తుందో లేదో చూడాలి.
మరో మూడు రోజులలో క్రిస్మస్ కానుకగా ఇద్దరి లోకం ఒకటే మరియు మత్తువదలరా చిత్రాలు విడుదల కానున్నాయి. దీనితో మరింత పోటీ పెరగనుంది. దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించగా చిరంతన్ భట్ సంగీతం అందించారు.
