మెగాస్టార్ కోసం భారీగా అభిమానులు !

Published on Mar 8, 2021 6:40 pm IST

హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ జంటగా రానున్న సినిమా ‘శ్రీకారం’. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ సాయంత్రం నుండి ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరవుతారని తెలియడంతో అభిమానులు భారీ ఎత్తున వస్తున్నారు.

కాగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్స్ కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి 11న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.

సంబంధిత సమాచారం :