“దేవర” విషయంలో అతడిపై భారీ హైప్.!

NTR30 1

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు భారీ హంగులతో తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో హైప్ ఎక్కించే ఎన్నో క్రేజీ అంశాల్లో ఇప్పుడు అంతకంతకు ఎగ్జైట్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా మ్యూజిక్ విషయంలో అని చెప్పాలి.

ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తుండగా తాను రీసెంట్ గా చేసిన “జైలర్” చూసిన తర్వాత తాను నెక్స్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “దేవర” పై అందరి కళ్ళు పడ్డాయి. అంతే కాకుండా ఇప్పటికే మోషన్ పోస్టర్ టీజర్ కి ఇచ్చిన మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది. వీటితో ఫుల్ లెంగ్త్ సినిమాలో అనిరుద్ మ్యూజిక్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ లో ఇస్తాడో అనేది ఆసక్తిగా మారింది.

Exit mobile version