కాంచన 3 లో ఒక్క సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారు !

Published on Apr 14, 2019 10:13 am IST

సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం కాంచన 3 పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో వేదిక , ఓవియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రం లో కేవలం ఒకే ఒక్క సాంగ్ కోసం 1.3 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ ను 6 రోజుల్లో పూర్తి చేయగా 1400 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ సినిమా ఫై అంచనాలను పెంచింది. ఈ చిత్రం తమిళం తోపాటు తెలుగులో ఏప్రిల్ 19న విడుదలకానుంది. లారెన్స్ సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :