“కేజీయఫ్ 2” కు అక్కడ భారీ ఆఫర్.!

Published on Jan 26, 2021 2:04 pm IST

ఇపుడు ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండెత్తడానికి రెడీగా ఉన్న చిత్రాల్లో సెన్సేషనల్ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు సెట్ చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. అయితే ఈ సాలిడ్ చిత్రంకు ఇప్పటికే అన్ని భాషల్లో కూడా భారీ అంచనాలు సెట్ అయ్యాయి.

మరి లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో అయితే అంచనాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. అయితే అన్ని పాన్ ఇండియన్ సినిమాలకు కూడా హిందీ మార్కెట్ ఎంత కీలకమో దీనికి కూడా హిందీ మార్కెట్ అంతే కీలకంగా మారింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు కూడా అక్కడ పిచ్చ క్రేజ్ నెలకొంది.

అందుకు తగ్గట్టుగానే ఈసారి చాప్టర్ కు భారీ ఆఫర్ వచ్చినట్టే తెలుస్తుంది. గతంలో వచ్చిన ఆఫర్ కు మేకర్స్ నుంచి ఎంత డిమాండ్ వచ్చినా బాలీవుడ్ లో రిలీజ్ చేయనున్న ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఓకే చేసినట్టు తెలుస్తుంది. అలాగే హిందీ రైట్స్ ముందు కన్నా కూడా కొన్నింతలు ఎక్కువే పెట్టి కొన్నారట మరి ఈ భారీ చిత్రం హిందీలో ఎలాంటి వసూళ్లను కొల్లగొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :