
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నటులలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఫ్లాపుల పరంపరకు బ్రేక్ రావడానికి విభిన్న సబ్జెక్ట్ లు ట్రై చేస్తున్నాడు. అదే ప్రయత్నంలో ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో ‘పటాస్’ గా మనముందుకు రానున్నాడు.
ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా 370కు పైగా స్క్రీన్ లలో విడుదలకు నోచుకుంటుంది. కళ్యాణ్ రామ్ పోషించిన పోలీస్ పాత్ర సినిమాకే ప్రధానాకర్షణ అని తెలుస్తుంది. అనీల్ రావిపూడి దర్శకుడు. శృతిసోధి హీరోయిన్. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

