“పుష్ప” కోసం సుకుమార్ కు భారీ రెమ్యూనరేషన్.?

Published on Jan 22, 2021 6:04 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ కూడా ఒకరు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా తన టేకింగ్ లో కానీ సినిమా సినిమాకు కొత్తదనం కానీ ఎక్కడా మిస్ చెయ్యకుండా మ్యాజిక్ చేస్తూ వస్తున్నారు. మరి అలా ఈసారి మరో పక్కా మాస్ చిత్రంతో రావడానికి సిద్ధం అవుతున్నారు. అదే “పుష్ప”.

తన మొట్ట మొదటి హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం అందులోను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఇలాంటి సాలిడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సుకుమార్ కు గాను గట్టి రెమ్యునరేషనే ముట్టనున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి గాను సుకుమార్ 23 కోట్ల మేర రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కానీ మంచి హాట్ టాపిక్ గా అయితే నిలిచింది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :