నాగ చైతన్య చెప్పిన డైలాగులు భలే పేలుతున్నాయి !


గతేడాది వరుసగా రెండు మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించి నటుడిగా తన స్థాయిని పెంచుకున్న నాగ చైతన్య ఈ సంవత్సరం పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంతో మన ముందుకొస్తున్నాడు. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి క్లాసికల్ హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మొదటి పోస్టర్ నుండి మంచి పాజిటివ్ క్రేజ్ ను బిల్డ్ చేసుకున్న ఈ సినిమా నిన్న విడుదలైన ట్రైలర్ తో మరింతగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా ట్రైలర్ లో నాగ చైతన్య చెప్పిన ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం, నాన్న ఎక్కువేంటి.. ఎక్కువే’ అంటూ చెప్పే డైలాగులు అభిమానుల్ని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తూంటే సినిమా ఫాథర్ సెంటిమెంట్ మీద నడిచే రొమాంటిక్ ఎంటర్టైనరని ఇట్టే తెలిసిపోతోంది. పైగా దేవి శ్రీ అందించిన సంగీతం, పాటలు కూడా శ్రోతల్ని అలరిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 26న రిలీజ్ చేయనున్నారు.