5 మిలియన్ వ్యూస్ సాధించిన “రాఖీ విత్ భోళా శంకర్”

Published on Aug 24, 2021 6:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వరుస సినిమాల ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం ల్ భోళా శంకర్ సినిమా ప్రకటన వెలువడింది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి సురేష్ నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు తో పాటుగా, రాఖీ పండుగ కూడా ఉండటం తో రాఖీ విత్ భోళా శంకర్ అంటూ ఒక వీడియో ను విడుదల చేయడం జరిగింది. టైటిల్ ప్రకటన మరియు ఈ విడియో విడుదల తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అంతేకాక యూ ట్యూబ్ లో ఈ వీడియో ఇప్పటి వరకూ 5 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది. 5.3 మిలియన్ వ్యూస్ మరియు 235కే లైక్స్ తో టాప్ ట్రెండ్ లో కొనసాగడం విశేషం. ఈ చిత్రానికి మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా, అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :