“ఊరిలో వినాయకుడు”కి అదిరిపోయే రెస్పాన్స్..!

“ఊరిలో వినాయకుడు”కి అదిరిపోయే రెస్పాన్స్..!

Published on Aug 30, 2021 9:58 PM IST

Vinayakudu

చిన్నా పెద్దా తేడా లేకుండా, కుల మత బేధాల తారతమ్యం కనిపించకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. అయితే ఈ పర్వదినాన మస్తీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మనందరి సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు మల్లెమాల ప్రొడక్షన్స్ వారు “ఊరిలో వినాయకుడు” అనే కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

ఈ ప్రోమోకు కేవలం రెండు రోజుల్లోనే 5 మిలియన్‌కి పైగా వ్యూస్ రాగా, 164కె లైక్స్ వచ్చాయి. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఫుల్ టూ కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయిన ఈ కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేయాలంటే మాత్రం సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు ఉదయం 9:00 గంటలకు ఈటీవీని చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు