‘ఉస్తాద్’లో భారీ సెట్టింగ్.. మైత్రి వాళ్ళ కెరీర్ లోనే ఏ సినిమాకి కూడా లేదట!

‘ఉస్తాద్’లో భారీ సెట్టింగ్.. మైత్రి వాళ్ళ కెరీర్ లోనే ఏ సినిమాకి కూడా లేదట!

Published on Mar 3, 2026 1:59 AM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ మాస్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి ఆల్రెడీ రెండు పాటలు అయితే వచ్చాయి. ఇక ఈ రెండు సాంగ్స్ తర్వాత మూడో సాంగ్ కూడా ఉంది. మరి ఈ సాంగ్ కి మాత్రం తమ కెరీర్ లోనే భారీ సెట్టింగ్ ని వేసినట్టు హరీష్ తెలిపారు.

ఒక్క తన సినిమాల్లోనే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు వరకు తీసిన అన్ని సినిమాల్లో కూడా ఈ రేంజ్ భారీ సెట్టింగ్ ని వేయలేదని రివీల్ చేశారు. సినిమాలో చూసినప్పుడు ఆ సాంగ్ తాలూకా విజువల్స్, గ్రాండియర్ తెలుస్తుందట. మరి అంత ఖర్చు పెట్టి చేసిన సెట్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 26న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు