అజిత్ సినిమా కోసం భారీ సెట్టింగ్
Published on Feb 20, 2018 9:06 am IST

తమిళ స్టార్ హీరో అజిత్ దర్శకుడు శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సిద్దమైన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అజిత్, శివల కాంబినేషన్లో తెరకెక్కిన ‘వివేగం, వేదాళం, వీరం’ వంటి సినిమాలు మంచి హిట్లుగా నిలవడంతో ఈసారి చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ‘విశ్వాసం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తమిళ సినీ వర్గాల సంచారం మేరకు ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభంకానుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం భారీ వ్యయంతో ఉత్తర చెన్నైని పోలిన సెట్ ను నిర్మిస్తున్నారట. ఇప్పటికే నటీ నటుల ఎంపిక పూర్తికాగా ఈ వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

 
Like us on Facebook