సూర్య సినిమా కోసం భారీ సెట్ వేస్తున్న నిర్మాతలు !
Published on Feb 19, 2018 1:03 pm IST

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విధితమే. కొని వారాల క్రితమే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ ను ముగించుకుని రెండవ షెడ్యూల్ కు సిద్దమైంది. ఈ షెడ్యూల్ కోసం చెన్నైలో భారీ టౌన్ సెట్ ను నిర్మించారు.

తమిళనాడులోని తిరునెల్వేలి జిలాలోని అంబా సముద్రం అనే టౌన్ ను ప్రతిబింబించే విధంగా ఈ సెట్ ఉంటుందట. సూర్యతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. సుమారు 20 రోజులపాటు ఈ షెడ్యూల్ జరగనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడని సమాచారం.

 
Like us on Facebook