వాళ్ళ విడాకుల వెనక ఆ స్టార్ హీరోయిన్ ?

Published on May 16, 2022 6:01 pm IST

‘స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌’ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ కూడా, తన భార్య సీమా ఖాన్‌ కు విడాకులు ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విడాకుల వెనక ఓ హీరోయిన్ ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ ?. బాలీవుడ్‌ హీరోయిన్ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ గత కొన్ని నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సీమా ఖాన్‌ కి – సోహైల్‌ ఖాన్‌ మధ్య గొడవలు కూడా జరిగాయని.. ఈ క్రమంలోనే ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే, ఈ వార్తల పై గతంలో హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ సోహైల్‌ నాకు అన్నలాంటి వాడని చెప్పింది. ఏది ఏమైనా ఎంతో అన్యోన్యంగా ఉండే సోహైల్‌ ఖాన్‌ – సీమా ఖాన్‌ జంట, పెళ్లయిన 24 ఏళ్ల అనంతరం విడిపోవాలని నిర్ణయించుకోవడం షాకింగ్ విషయమే. 1998లో సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :