
ఇండియాలో మొట్ట మొదటి సారిగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొదటి మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. బడ్జట్ లోనే కాదు విజువల్స్ పరంగా కూడా హాలీవుడ్ కి దీటుగా నిలిచేలా ఉండనున్న ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 8 రోజులు ఉంది. కానీ రెండు వారాలకు ముందు నుంచే ఈ సినిమాకి సంబందించిన ఫుల్ హంగామా మొదలైపోయింది. ఇప్పటికే బాహుబలి రిలీజ్ అవనున్న థియేటర్స్ వద్ద అభిమానులు భారీ భారీ హోర్డింగ్స్ కడుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు టికెట్స్ కోసం కూడా భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ కి సంబందించిన టికెట్స్ కూడా ప్రింట్ అయిపోయాయి, పోలీస్ పర్మిషన్ రాగానే షో టైమింగ్స్ కూడా అనౌన్స్ చేసేస్తారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ సినిమా బెనిఫిట్ షో టైమింగ్స్ ఇంకా ఖరారు కాకపోయినా అభిమానులు మాత్రం టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లో బెనిఫిట్ షో టికెట్ కాస్ట్ 3000 నుంచి 4000 పలుకుతోంది. రిలీజ్ రోజు రాష్ట్రం మొత్తం చాలా బెనిఫిట్ షోస్ ఉన్నాయి. ఎక్కడా టికెట్స్ కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మరి కొద్ది రోజుల్లోనే అన్ని టికెట్స్ అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ కనిపించనుంటే, విలన్ గా రానా దగ్గుబాటి కనిపించనున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

